Super Star Krishna Statue: టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15న పరలోకాలకు విషయం తెలిసిందే. ఆయన మ*రణంతో తెలుగు సినీ పరిశ్రమంతా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురికాగా.. ఇక కృష్ణ పుట్టిన ఊరు అయిన బుర్రిపాలెం గ్రామస్థులు అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ అభిమాన నటుడి కోసం ఏమైనా చెయ్యాలని గ్రామస్థులు సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే గ్రామస్థులు, అభిమానులు కలిసి సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని తయ్యారు చేయించారు. రీసెంట్ గా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని (ఆగస్టు 5) శనివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దివంగత సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని బుర్రిపాలెంలో గ్రామస్తులు, అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే గత కొంత కాలంగా విగ్రహావిష్కరణ పెండింగ్ పడుతూ వచ్చింది. శనివారం(ఆగస్టు 5)న ఎట్టకేలకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కృష్ణ విగ్రహావిష్కరణనికి కుటుంబ సభ్యులు కుమార్తె పద్మావతి, ప్రియదర్శిని, మంజుల, అల్లుడు సుధీర్ బాబు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా.. మహేష్ బాబు విదేశీ పర్యటనలో ఉండటంవల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. విదేశాలనుండి రాగానే మహేష్ గ్రామానికి వచ్చి కృష్ణ విగ్రహానికి నివాళులు అర్పిస్తారని ఆదిశేషగిరిరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణపై ‘దేవుడు లాంటి మనిషి’ అన్న పుస్తకాన్ని రాశారు వినాయకరావు. ఈ సందర్భంలోనే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
విగ్రహ ఆవిష్కరణలో కృష్ణ కూతురు మంజూల మాట్లాడుతూ..”బుర్రిపాలెం అంటే నాన్నకు చాలా ఇష్టం. అక్కడకు ఎప్పుడు వెళ్తున్నారు? ఒక్కసారి బుర్రిపాలెం వెళ్లిరండి అంటూ నాన్న మాతో ఎన్నో సార్లు చెబుతుండేవారు. ఇంత ప్రేమ, అభిమానానికి ఇప్పటిదాకా మేం దూరంగా ఉన్నామా? అని మాకు అనిపిస్తుంది. ఇక నుంచి సంవత్సరంలో ఒక్కసారైనా ఈ వూరు వస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి:‘బ్రో’ సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే..