Actress Ileana: ప్రముఖ నటి ఇలియానా పండంటి అబ్బాయి జన్మించాడు. ఆగస్టు 1న బాబు పుట్టినట్లు సామజిక మద్యమల్ల వేదికగా తెలిపింది. ఈ మేరకు బాబు ఫొటోను షేర్‌చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నది. మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తంచేసింది. ఫ్యాన్స్ , నెటిజన్లు ఇలియానాకు అభినందనలు చెప్తున్నారు.
దేవదాస్ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. 2018లో వచ్చిన రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో ఆఖరిసారిగా యాక్ట్ చేసింది. బాలీవుడ్‌లో 2021లో అభిషేక్ బచ్చన్ యాక్ట్ చేసిన బిగ్‌బుల్‌లో నటించింది.
View this post on Instagram
ఇదీ చదవండి:విశాఖలో దారుణం..! తిన్న ఇంటికే కన్నం వేసి వృద్దురాలిని హత్య చేసిన వాలంటీర్..!