Prachi Thaker: సినిమా అనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఎంతో మంది యువతీ, యువకులు వస్తూ ఉంటారు. ఈ సందర్భంలోనే వారు ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక సినీ రంగంలో హీరోయిన్ కావాలని కలలు కనే అమ్మాయిలు ఎదుర్కొనే ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీకి వచ్చే యువతుల కలను అలుసుగా చేసుకుని తాము అడిగింది ఇస్తే.. అవకాశాలు ఇప్పిస్తామని కొన్ని ఏజెన్సీలు చెబుతూ ఉంటాయి. అటువంటి వారికి కొందరు ఘాటుగా రిప్లయ్లి ఇస్తూ ఉంటారు. మరికొందరు భయంతో, ఆందోళనతో కన్నీరు పెట్టుకుంటూ ఎం చెయ్యాలో తెలియక తమలోనే దాచుకుంటారు. రీసెంట్ గా ఓ హీరోయిన్ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకొన్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
హీరోయిన్ ప్రాచీ ఠాకర్.. రాజుగాడి కోడి పులావ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం ఇచ్చింది. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రాచీ ఠాకర్ మాట్లాడుతూ..”నేను చదువుకునే రోజుల్లోనే పటాస్ సినిమా చేశాను. ఆ తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ వాళ్లు యాడ్ ఒకటి చేయాలని నన్ను సంప్రదించారు. నేను దానికి సరే అన్నాను. కానీ నాకు తెలుగు భాష రాకపోవడంతో.. తెలిసిన తెలుగు ఫ్రెండ్ ను మీడియేటర్ గా పెట్టుకున్నాను.
కాగా.. నాకు దానికి అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చారు. నా ఫోన్ నంబర్ తీసుకుని షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది చెప్తానన్నాడు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి మీరు కమిట్ మెంట్ ఇస్తున్నారు కదా? అని అడిగాడు. నాకు అసలు అర్ధం కాలేదు. షూటింగ్ ఎప్పుడు ఉంటే ఆ రోజే కమిట్ మెంట్ ఇస్తానని చెప్పాను. అయితే మీరు కమిట్ మెంట్ కు రెడీ కాదా? అని మరోసారి నన్ను ప్రశ్నించాడు.
నాకు ఒక బిజినెస్ పార్ట్ నర్ ఉన్నాడు, నీకు 2 లక్షలిస్తాడు అతడితో కాంప్రమైజ్ అవుతావా? అన్నాడు” అంటూ చెప్పుకొచ్చింది ప్రాచీ ఠాకర్. అతడి మాట్లాడే భాష నాకు అర్దం కాకపోవడంతో.. నా ఫ్రెండ్ కు ఇదంతా చెప్పానని ప్రాచీ తెలిపింది. దాంతో అతడు నాకు అసలు విషయం పూసగుచ్చినట్లు మెుత్తం చెప్పాడంతో.. ఆ యాడ్ చేయనని చెప్పినట్లుగా ప్రాచీ ఠాకర్ తెలిపారు.
ఇదీ చదవండి:ఆ హీరో పక్కలోకి వస్తే ఆఫర్స్ ఇస్తా అని బలవంతం చేశారు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్.!