Roja: టాలీవుడ్ మూవీ ప్రేమతపస్సు తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది రోజా.. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. విజయాన్నికి కెరాఫ్ అడ్రస్ గా రోజా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లతో ఎన్నో మూవీస్ లో హీరోయిన్ గా నటించింది. బాలకృష్ణ చేసిన జానపద మూవీస్ లో ఎక్కువగా రోజానే హీరోయిన్ గా వుండేది. భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున యుద్దం లాంటి మూవీస్ లో బాలయ్య పక్కన జోడిగా నటించి అందరిని ఆకట్టుకుంది.
2014, 2019 ఏళ్లలో వైసీపీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రోజా. 2014 సంవత్సరంలో తక్కువ మెజారిటీతోనే ఎమ్మెల్యేగా గెలుపును కైవసం చేసుకుంది రోజా 2019లో మాత్రం భారీ మెజారిటీని సొంతం చేసుకుంది.కేబినేట్ లో రోజాకు చోటు దక్కకపోయినా జగన్ రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. మరో ఆరునెలల అనంతరం ఏర్పాటు కాబోయే కేబినేట్ లో రోజాకు చోటు దక్కవచ్చని తెలుస్తోంది.
ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ రోజా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కు జడ్జిగా ఇదివరకు వ్యవహరించడంతో పాటు ఆ ఛానెల్ లో జరిగే ఈవెంట్లలో పాల్గొంటూ రచ్చ చేస్తున్నారు.అయితే లేటెస్ట్ గా రోజా కొన్ని నిమిషాల పాటు కబడ్డీ ఆటను ఆడారు. చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలంలో అంబేద్కర్ కబడ్డీ టోర్నమెంట్ ను రోజా స్టార్ట్ చేసారు. అక్కడ కబడ్డీ ఆడుతున్న ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రోజా కొంత టైం కబడ్డీ ఆడారు.
రోజా బాల్యంలో ఆడిన ఆటలను గుర్తు తెచ్చుకోవడంతో పాటు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు అనే చెప్పాలి. రోజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు. కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి స్థానిక వైసీపీ నేతలు కూడా అటెండ్ అయ్యారు. మరోవైపు రోజా గత కొన్నేళ్లుగా చిత్రాలకు మాత్రం దూరంగానే ఉండటం గమనార్హం. ఆఫర్లు వస్తున్నా రాజకీయాలతో బిజీగా ఉండటం వల్లే రోజా చిత్రాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
నగరి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రోజా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న వారికి ధీటుగా బదులు ఇస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజా ఆడిన కబ్బాడి ఆట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒక లుక్ వేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.
ఇదీ చదవండి:పింక్ డ్రెస్సులో వాటిని చూపించేస్తూ రచ్చ చేస్తున్న పూజ పాప.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్..!