Skip to content

Raghuvaran: ఎప్పుడు కొడుకునే తల్చుకునేవాడు.. రఘువరన్‌ మరణానికి కారణం అదే.. అన్నయ్య మృతిపై నోరు విప్పిన సోదరుడు

Raghuvaran real life

Raghuvaran: రఘువరన్‌.. తనదైన విలక్షణ నటనతో ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దిగ్గజ నటుడి గురించి ప్రేత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్కినేని నాగార్జున శివ చిత్రంలో భవానీ.. బాషా చిత్రంలో ఆంటోనీ.. సుస్వాగతం చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ తండ్రిగా ఈ మూడు పాత్రలే చెబుతాయి రఘువరన్‌ నటనలో ఉన్న దమ్ము ఎలాంటిదో.. విలన్‌గా, కామెడీ యాక్టర్‌గా, తండ్రిగా.. ఇలా ఎటువంటి పాత్రకైనా ప్రాణం పోసే అతి తక్కువ మంది నటుల్లో రఘువరన్‌ ఒకరు. ముఖ్యంగా ఆయన డైలాగ్‌ మాడ్యులేషన్‌కి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు.

తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200కు పైగా సినిమాలలో నటించారు రఘువరన్‌. ఆయన నటన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు మరెన్నో ప్రశంసలు పొందారు. ఇక పర్సనల్‌ లైఫ్‌ విషయానికొస్తే.. ప్రముఖ నటి రోహిణీని రఘువరన్‌ 1996లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2000లో వరుణ్‌ రిషి అనే బిడ్డ జన్మించాడు. అయితే కొన్ని కారణాలతో రోహిణీ – రఘువరన్‌ 2004లో విడాకులు తీసుకున్నారు. ఇదే టైములో మద్యపానానికి బాగా అలవాటుపడ్డారీ వర్సటైల్‌ యాక్టర్‌. దానివల్లనే పలు అనారోగ్య సమస్యలతో 2008 మార్చి 19న ఆయన కన్నుమూశారు. చనిపోయినా రఘువరన్‌ సినిమాల రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో శాశ్వతంగా నిలిచిపోయారు. ఇదిలా ఉండగా.. రఘువరన్‌ పర్సనల్ లైఫ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు ఆయన సోదరుడు రమేష్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వచ్చిన ఆయన రఘువరన్‌- రోహిణీల బంధం, విడాకులు, అన్నయ్య మరణానికి దారి తీసిన అప్పటి పరిస్థితులను వివరించారు.

Rohini Raghuvarun

‘విడాకులు తీసుకున్నాక కోర్టు పర్మిషన్‌తో తన కొడుకు దగ్గరకు ప్రతి శనివారం అన్నయ్య (రఘువరన్‌) వెళ్లేవారు. అప్పుడు ‘నాన్నా.. నాన్నా’ అని కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఆ టైములో కొడుకు మీద ప్రేమను బయటకు చూపిస్తేనే లోలోపల మాత్రం ఎంతో ఆవేదన చెందేవాళ్ళు. నాన్న అనే పిలుపు శనివారం మాత్రమే వినపడుతోందని చాలా కాలం పాటు మానసిక సంఘర్షణకు గురయ్యారు.

ఆదివారం రాగానే రోహిణీ వాళ్లు బాబుని తీసుకెళ్లేవాళ్లు. బాబు అలా వెళ్లిపోయాక కొడుకునే తలుచుకుంటూ అన్నయ్య విపరీతంగా మద్యం సేవించేవాడు. అలా చెయ్యటం వల్ల అన్నయ్యకి విపరీతమైన నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే మా అన్నయ్య చనిపోయాడు’ అని అప్పుడు జరిగిన చేదు జ్ఞాపకాలను పంచుకుని ఎమోషనల్‌ అయ్యారు రమేష్‌.

ఇదీ చదవండి:2 లక్షలిస్తా.. నాతో పోడుకుంటావా..? అని అడిగాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *