Skip to content

Hero Vishal: త్వరలో ఆ హీరోయిన్‌తో ఏడడుగులు వేయనున్న స్టార్‌ హీరో విశాల్..

vishal marriage fix with heroine laxmi menon

Hero Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఇతను సుపరిచితమే. తను నటించిన ప్రతి మూవీ తెలుగులో డబ్‌ అవుతుంది. అందుకే ఇక్కడ కూడా హీరో విశాల్‌కు సూపర్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన వివాహం గురించి వార్తలతోనూ తరచూ నిలుస్తుంటాడు విశాల్‌. అంతకముందు హైదరాబాద్ కు చెందిన అనిషా రెడ్డి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కూడా. దీంతో హీరో విశాల్‌ పెళ్లి అయిపోయినట్టేనని అభిమానులు అనుకున్నారు.

అయితే కొన్ని కారణాలతో ఆ పెళ్లి పెటాకులైంది. ఆ తర్వాత కోలీవుడ్‌ సీనియర్ నటుడు శరత్‌ కుమార్‌ కుమార్తె వరలక్ష్మీతో విశాల్‌ ప్రేమాయణం నడిపాడని రూమర్స్ వచ్చాయి. వీళ్ళు వివాహం కూడా చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లేనని విశాల్‌, వరలక్ష్మీ ఈ వార్తలను కొట్టిపారేశారు. ఇక ఆ మధ్యన ‘శంభో శివ శంభో’ ఫేమ్‌ నటి అభినయతో విశాల్‌ పెళ్లి జరగనున్నట్లు న్యూస్ వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని విశాల్‌తో పాటు అభినయ కూడా తేల్చి చెప్పేశారు. తాను ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే మీ అందరికి శుభవార్త చెబుతానని విశాల్ అప్పట్లో చెప్పుకొచ్చాడు. ఈక్రమంలో విశాల్‌ పెళ్లి వార్తలు మళ్లీ నెట్టింట గుప్పమంటున్నాయి. గతంలో తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన లక్ష్మీ మేనన్‌తో విశాల్‌ ఏడడుగులు నడవనున్నాడన్నా వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

సుందర్ పాండియన్ అనే సినిమాతో లక్ష్మీ మేనన్‌ వెండితెరకు పరిచయమైంది. తన అందం, అభినయంతో కోలీవుడ్‌లో చాలా తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది. . కుమ్కీ (తెలుగులో గజరాజు), కుట్టిబులి, జిగర్తాండ, పాండియనాడు, నాన్ సికపు మన్మన్, కొంబన్ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి మెప్పించింది. ఇక మరో రెండు రోజుల్లో విడుదల కానున్న భోళాశంకర్‌లో కీర్తి సురేష్‌ పోషించిన పాత్రను తమిళంలో లక్ష్మీమేనన్‌ నే పోషించడం విశేషం.

ఇక విశాల్‌తో కలిసి ‘పాండియనాడు( తెలుగులో పల్నాడు), ‘ఇంద్రుడు’ వంటి సూపర్ హిట్‌ చిత్రల్లో నటించింది. ఈ జంటకి మంచి పేరు కూడా వచ్చింది. అప్పట్లోనే విశాల్‌, లక్ష్మీ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని టాక్‌ వినిపించింది. అయితే ఆ తర్వాత లక్ష్మీ మూవీస్ లకు దూరం కావడంతో రూమర్లు ఆగిపోయాయి. అయితే మరోసారి ఈ హిట్‌ పెయిర్‌ పెళ్లి రూమర్లు తెరమీదకొచ్చాయి. మరి ఈసారైనా హీరో విశాల్ పెళ్లి వార్తలు నిజమవుతాయా? లేదా పుకార్లగానే మిగిలిపోతాయా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదీ చదవండి:2 లక్షలిస్తా.. నాతో పోడుకుంటావా..? అని అడిగాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *