MaheshBabu: టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగిన మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఫాన్స్ ని ఖుషీ చేసే అప్‌డేట్ వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ప్రిన్స్ నెక్స్ట్ సినిమా గుంటూరు కారం చిత్రంలోని మహేష్‌బాబు మాస్ లుక్ ఫోటోని రిలీజ్ చేశారు.
MaheshBabu: టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగిన మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఫాన్స్ ని ఖుషీ చేసే అప్‌డేట్ వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ప్రిన్స్ నెక్స్ట్ సినిమా గుంటూరు కారం చిత్రంలోని మహేష్‌బాబు మాస్ లుక్ ఫోటోని రిలీజ్ చేశారు.
మహేష్ బాబు ఈ రోజు 48 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా గుంటూరు కారం చిత్రంలోని స్టిల్ ఇప్పుడు క్రేజీగా మారింది. లుంగీ కట్టుకొని ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని, కళ్లజోడు పెట్టుకొని బీడీ వెలిగించుకుంటున్న పిక్ సూపర్ స్టార్ అభిమానులకు బాగా నచ్చేస్తోంది.
శ్రీమంతుడు, మహర్షి లాంటి క్లాస్ మూవీలు చేసిన తర్వాత మహేష్ బాబు చేస్తున్న పక్కా మాస్ సినిమా ఇది. ఇందులో మహేష్ గెటప్ చుస్తే క్లాస్‌గా కనిపించినప్పటికి డైలాగ్‌లు, నటన ఊర మాస్‌గా క్రియేట్ చేస్తున్నారు డైరెక్టర్ తివిక్రమ్ శ్రీనివాస్.
గుంటూరు కారం మూవీ కోసం భారీగా కష్టపడుతున్న చేస్తున్న మహేష్ .. వర్కవుట్స్, హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేశాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి చిత్రం కూడా ఉండటంతో సూపర్ స్టార్ ఫాన్స్ ఫుల్ బిందాస్‌గా ఉన్నారు.
రెండూ క్రేజీ ప్రాజెక్టులు కావడం, ఇద్దరూ స్టార్ డైరెక్టర్‌లు కావడంతో మహేష్‌బాబు రాబోయే సినిమాలపై అభిమానుల్లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే గుంటూరు కారం టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటోకి అంతే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)
వన్ బై వన్ డిఫరెంట్ మూవీస్లో చేసుకుంటూ వస్తున్న మహేష్‌బాబు గుంటూరు కారంలో సర్కారువారి పాట చిత్రంలో కంటే పవర్ ఫుల్, మాస్ పర్‌ఫార్మెన్స్ ఉండబోతుందని టీజర్ చూడగానే అర్ధమైంది. ఇక బర్త్ డే రోజు రిలీజ్ చేసిన ఫోటో చుస్తే అంతకు మించి అన్నట్లుగా ఉంది.
ఇప్పటి వరకు టాప్ డైరెక్టర్‌లతో నటించిన మహేష్ బాబు, సినీ ఇండస్ట్రీలో రికార్డులు బద్దల కొట్టిన సూపర్ స్టార్.. టాలీవుడ్‌లో తన తండ్రి కృష్ణ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ..సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్‌ని ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. కొత్త డైరెక్టర్‌లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు.
గుంటూరు కారం సినిమా యూనిట్ మహేష్‌బాబుకు బర్త్డే విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన పిక్ పై ఇప్పటికే ఫాన్స్ పై విపరీతంగా స్పందిస్తున్నారు. సూపర్ స్టార్‌కి మరో బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అంటున్నారు అభిమానులు.
‘మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతికి రానుంది. ఈ మూవీతో పాటే రాజమౌళి చిత్రం షూటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తోంది. ఏదేమయిన డబుల్ ధమాకా కొట్టేందుకు ప్రిన్స్ మహేష్ రెడీ అవుతున్నాడు. (Mahesh Babu Trivikram)
త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీను ఇండియానా జోన్స్ తరహా జానర్‌లో రాబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఈ కాంబినేషన్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదీ చదవండి:చీర ఎగెట్టి బరిలోకి సివంగిలా దిగి కబ్బాడి ఆటతో అదరకొట్టిన రోజా.. వైరల్ వీడియో..!!