Viral News: కోతులు వెంటపడటంతో భయపడిన ఓ ముసలావిడ చేసేదేమీలేక చేదబావిలో దూకింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గంభీర్‌పూర్ రాజవ్వ అనే ముసలావిడ పెన్షన్ డబ్బులతో జీవనం కొనసాగిస్తూ ఇంట్లో ఒంటిరిగా నివసిస్తుంది. శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వను కోతుల మంద తరమడంతో ఏం చేయాలో అర్ధం కాక ఆమె.. అక్కడే ఉన్న బావిలోకి అమాంతం దూకింది.
బావిలో ఉన్న రాయిపై నిలబడి కాపాడండి అంటూ కేకలు వేసింది. అక్కడే ఉన్న ఓ యువకుడు తాడు తీసుకుని బావిలోకి దిగి ముసలావిడ నడుముకు కట్టాడు. అనంతరం స్థానికుల సాయంతో ఆమెను పైకి తీసుకువచ్చారు. ఆ ముసలావిడ ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి:2 లక్షలిస్తా.. నాతో పోడుకుంటావా..? అని అడిగాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..